బాలానగర్‌ కు చెందిన పరంజ్యోతికి అద్భుత ప్రదర్శనలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌

 

కూకట్పల్లి (ప్రజా బలం) ఏప్రిల్ 15 :
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్‌ చెందినకు 39 ఏళ్ల ఎం.జె. పరంజ్యోతి అద్భుతమైన సంగీత ప్రదర్శనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి అరుదైన ఘనత సాధించారు. గతేడాది డిసెంబర్ 1న విజయవాడలోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్‌లో లీడ్ మేనేజర్ ఆగుస్టీన్ డాండింగి వేణుగోపాల్ నేతృత్వంలో ఏకంగా 1046 మంది కళాకారులు ఏకకాలంలో ‘శంకరాభరణం’ రాగాన్ని మొత్తం పూర్తి మూడు తాళాల్లో గంట పాటు ఆలపించి ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని స్వయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయ నిర్ణేత రిచర్డ్ విలియమ్స్ స్టెన్నింగ్ పరిశీలించి ధృవీకరించారు. ఈ ఘనత సాధించినట్లు అధికారిక ధృవీకరణ డిసెంబర్ 9, 2024న ప్రకటించారు. దీనికి సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లోని మణికొండలోని ది లైఫ్ చర్చ్‌లో బహుమతి పురస్కార కార్యక్రమం అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరంజ్యోతి ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ రికార్డు తన నిజమైన విజయం అని, తన కృషి, పట్టుదల సంగీతం పట్ల అంకితభావానికి నిదర్శనమని అన్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమం కోసం తాను గత రెండేళ్లుగా సన్నద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రదర్శన జరిగిన రోజే పూర్తి రికార్డింగ్‌ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రధాన కార్యాలయానికి పంపినట్లు పరమ జ్యోతి వివరించారు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, వారి రికార్డుకు సంబంధించిన అధికారిక ధృవీకరణ డిసెంబర్ 9, 2024న వారికి అందింది. ఈ అసాధారణ విజయం ఎం.జె. పరంజ్యోతికి వ్యక్తిగత గుర్తింపును తీసుకురావడమే కాకుండా, ఈ ప్రాంతంలోని గొప్ప సంగీత ప్రతిభను, వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. పరంజ్యోతి యొక్క అంకితభావం 1046 మంది కళాకారుల యొక్క సమిష్టి కృషి సంగీత చరిత్రలో ఒక కొత్త మైలురాయిని సృష్టించింది, తద్వారా వారికి ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో సముచిత స్థానం లభించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking