అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకొని పతాకావిష్కరణ

👉 అగ్నిమాపక శాఖ అధికారి టీ, శ్రీనివాస్ గౌడ్

ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 15, ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట, అగ్నిమాపక కేంద్రంలో, అగ్నిమాపక శాఖ అధికారి టి,శ్రీనివాస్ గౌడ్, ఆధ్వర్యంలో ఏప్రిల్ 14, నుండి 20వ,తారీకు వరకు నిర్వహించే వివిధ కార్యక్రమాలలో భాగంగా సోమవారం,పతాకావిష్కరణ, గావించారు, ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి టి,శ్రీనివాస్ గౌడ్,మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగిఉండాలని,
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉందని అన్నారు,1944, ఏప్రిల్ 14న,ముంబైలోవిక్టోరియా వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో, అసువులు బాసిన 66, మంది, అగ్నిమాపక సిబ్బంది, గుర్తుగా,అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు, అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని, వివిధ ప్రాంతాల్లో, అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాల గురించి, ప్రజలకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు, ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది అగ్నిమాపక వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…..

Leave A Reply

Your email address will not be published.

Breaking