గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:బుధవారం నాడు హైదరాబాద్ లోని బషీర్‌బాగ్‌లోని ఇ డీ ఆఫీస్ ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీఎంపీ కాంగ్రెస్ సీనీయర్ నాయకులు వి. హనుమంత్ రావు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గోన్న కుటుంబం భారతదేశం కోసం ప్రాణాలనర్పించిన కుటుంబం పై ప్రభుత్వం కక్షగట్టి ఈడీ సీబీఐ పేరిట వేదించడం ప్రజలు గమనిస్తున్నారు.త్వరలోనే బిజేపీ పార్టీని గద్దె దించడం కాయం అని అన్నారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతరావ్ మాజీఎంపీ కాంగ్రెస్ సీనీయర్ నాయకులు వి. హనుమంత్ రావు , కార్పొరేటర్ విజయ రెడ్డి గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం సతీష్ గౌడ్. సుభాష్ లడ్డు, నగేష్, ఇఫతేఖర్, ఆరీఫ్, చెతనే, బద్రీనాథ్. శ్రీకాంత్ యాదవ్, చిట్టీ మరియు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు పాల్గొన్నారు
