వేణు కి డా॥బీఆర్‌.అంబేద్కర్‌ ఎక్సలెన్సీ అవార్డు

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:రవీంద్ర భారతి లో జరిగిన కార్యక్రమంలో డా॥బీఆర్‌.అంబేద్కర్‌ ఎక్సలెన్సీ అవార్డ్ను2025 ను అంతడుపుల వేణు కి ప్రదానం చేసారు. అతను విద్యుత్‌ సంస్థలో ఉద్యోగి గా ప్రభుత్వ లక్ష్యలకు అనుగుణముగా వినియోగరులకు అత్యున్నతమైన సేవలను అందిస్తూ ప్రజల ఆధారాభిమానాలను చురగోన్నారు. అదేవిదంగా, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ సంస్థ 1104 కార్మిక సంఘానికి అధ్యక్షులు గా ఉంటూ గత 20 సంస్థరాలుగా విద్యుత్‌ కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సమాజములో ప్రజల సమానత్వము కోసం, మానవతా ప్రమాణాల కోసం పాటుబడుతున్నాడు. అతని విశిస్ట సేవలకు డా॥బీఆర్‌.అంబేద్కర్‌ ఎక్సలెన్సీ అవార్డ్ను2025 ను రవీంద్ర భారతి లో 17.04.2025, గురువారం జరిగిన కార్యక్రమం లో ప్రధానము చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్లానింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మాజీమంత్రి సముద్రాల వేణుగోపాల చారి , ప్రముఖ ఉపన్యాసకులు దేవాజ్ఞ శర్మ , నవకళ వేదిక అధ్యక్షులు మల్లికార్జున రావు , ఇతర సభ్యులు రవీంద్ర భారతి లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking