రాత్రేమో చీకటి దినంలో వీధి దీపాల వెలుగులు

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 19 శనివారం 2025
గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట భారత రాష్ట్ర సమితి పార్టీ స్థానిక నాయకులు ప్రజాబిప్రాయ సేకరణ గావిస్తూ శనివారం రోజున సెక్రటేరియట్ కాలనీ వీదులలో సందర్శించే సమయాన ప్రధాన సమస్యగా ప్రజా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా జలమండలి మంచి నీటి సరఫరా కేంద్రం నుండి రాక పోకలకు ఉపయోగించే ట్రక్ డ్రైవర్లు నిర్లక్ష ధోరణితో వాహనాలను ఇష్టానుసారం అతి వేగంగా నడుపుతున్నారని అట్టి సమయంలో దుర్ఘటనలు జరిగే ఆస్కారం ఎంతైనా ఉన్నదని స్థానికులు వారి అభిప్రాయమును వెల్లి బుచారు. ఇక్కడ ముఖ్యంగా గమనించ వలసినది మంచి నీటి సరఫరా కేంద్రం ప్రక్కనే ఉస్మాన్ సాగర్ నుండి మీరాలం ట్యాంక్ కు నీటి సరఫరా చేసే కాండీడ్ లైన్ నుండి నేరుగా ఒక యించి పైప్ లైన్ ద్వారా 24 గంటలు నీరు పారుతున్నాను పట్టించుకొనే నాధుడు కరువైనారని, జలమండలి లైన్ మెన్ ల హస్త లాఘవంతో వారి ఇష్టానుసారం వేళా పాలా లేకుండా నీటి సరఫరా చేస్తున్నారని చింతించినారు. వీధి దీపాలు పగలు వెలుగుతూ రాత్రి పూట అవసరం ఉన్న చోట్ల అసలు వెలుగడం లేదనీ, విద్యుత్ శక్తి సరఫరా అవకతవకల కారణముగా విలువైన పరికరాలు దెబ్బ తింటున్నవని, వీధి మొత్తంగా అనవసర వైరులు ఉండి ప్రమాదాలకు తావివ్వొచ్చని తెలిపారు. రాత్రి కాగానే ఆకతాయి పిల్లలు ద్విచక్ర వాహనాలతో పాటు అల్లర్లు చేస్తున్నట్లు తేలియ పరుస్తూ పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని కోరారు. వీధి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వకుండా సఫాయి కర్మచారుల సేవలను ప్రతి రోజూ ఉడవ నీయ్యకుండా అధికారులు వేధిస్తూన్నారని పర్యవసానంగా చెత్త చెదారంలతో వీధి మొత్తం అపరిశుభ్రంగా ఉంటుందని వాపోయారు. పుప్పలగూడ పైప్ లైన్ రోడ్డు వీధి చివర బార్, వైన్స్, హోటల్ కారణముగా ట్రాఫిక్ సమస్య తీవ్రముగా ఉన్నదని తెలిపారు. పై అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తూ భారత రాష్ర్ట సమితి మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంబగళ్ళ ధనరాజ్, గుట్టమీది నరేందర్, అందే లక్ష్మణ్ రావు, బుద్ధోలు బాబు, మాల్యాద్రి నాయుడు, బిట్లుగు రాజు, ఉపేందర్నాథ్ రెడ్డి, సంఘం శ్రీకాంత్, సుమనళిని, బొడ్డు శ్రీధర్, శ్రీనివాస్ చారి, చెరుకూరి బాలాజీ, కోడిచెర్ల దేవేందర్, యాలాల కిరణ్, తిరుపతి, దిలీప్ తదితరులు కోరడమైనది.

Leave A Reply

Your email address will not be published.

Breaking