నేడే బీసీ గురుకులాల బ్యాక్ లాగ్ సెట్ ఆర్ సీ ఓ సేరు శ్రీధర్

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 20 : నేడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర మరియు బాలికల గురుకుల పాఠశాలల్లో 6,7,8 మరియు 9 వ తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ఎం జె పి బ్యాక్ లాగ్ సెట్ ప్రవేశ పరీక్ష రేపు అనగా ఏప్రిల్ 20 వ తేదీన ఉమ్మడి జిల్లాలోని 12 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి 12 గంటల మధ్య నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్ సీ ఓ సేరు శ్రీధర్ శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండు కేంద్రాలు,నిర్మల్ జిల్లాలో నాలుగు కేంద్రాలు,కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు కేంద్రాలు,మంచిర్యాల జిల్లాలో మూడు కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,308 విద్యార్థులు ఈ పరీక్షకి హాజరు కానున్నారని,ఇప్పటి వరకు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోని విద్యార్ధులు ఈ రోజే హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకొని ఆయా పరీక్ష కేంద్రాలకు ఒక గంట ముందే చేరుకోవాలని పరీక్ష ప్రారంభమైన తర్వాత ఎవరినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఈ సందర్భంగా ఆర్ సీ ఓ సేరు శ్రీధర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking