అంబేత్కర్  రాజ్యాంగం యావత్ ప్రపంచానికి స్పూర్తి దాయకం: కాలేరు

 

హైదరాబాద్ ఏప్రిల్ 14;శివానంద్ నగర్ యూత్ అసోసియేషన్ గాలిపెల్లి శంకర్ సోదరుల ఆధ్వర్యంలో కోరంటీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా  జరిగాయి.ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా స్థానిక శాసన సభ్యులు కాలేరు వెంకటేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేత్కర్  రాజ్యాంగం యావత్ ప్రపంచానికి స్పూర్తి దాయక మన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ప్రతి ఒకరికి మేలు జరిగిందని, ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయుని ఆదర్శనంగా తీసుకొని ప్రతి ఒక్కరికి సేవ, సహాయ కార్యక్రమాలు చేయాలన్నారు. అనంతరం నల్లకుంట ఇన్స్పెక్టర్ రవి మాట్లాడుతూ అంబేద్కర్ అంటే కేవలం ఒక్క కులానికి కాదని యావత్ దేశానికి తలమనికమన్నారు. ఈ కార్యక్రమం లో గాలిపెల్లిషివప్రసాద్, సురేష్, బొజ్జరాజు, విజయకుమార్, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking