– నిరుపయోగంగా మారిన డంపింగ్ యార్డులు
– గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్న చెత్త వ్యర్ధాలు
– పట్టించుకోని అధికార యంత్రాంగం
అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 5 ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా : పల్లెలను స్వచ్ఛత వైపు నడిపించేందుకు ప్రభుత్వం లక్షల రూపాయలను వెచ్చించింది, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ లు డంపింగ్ యార్డ్ లతోపాటు మరుగు దొడ్డి నిర్మాణం ఏర్పాటు చేసింది, కానీ ఇప్పుడు ఆ డంపింగ్ యార్డులు,నీటి వసతి లేక మరుగుదొడ్డిలు నిరుపయోగంగా మారాయి చెత్త సేకరణ నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో పల్లెలు అపరిశుభ్రత వాతావరణంలో దర్శమిస్తున్నాయి,అల్లాదుర్గం మండల కేంద్రంలో గత ప్రభుత్వం హయాంలో, చెత్తను సేకరించడానికి ట్రాక్టర్లతో పాటు డంపింగ్ యార్డులను ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టింది, తడి చెత్తను పొడి చెత్తను వేరుచేసి సేంద్రీయ ఎరువులు తయారుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు,ఆశయం మాత్రం ఎంతో ఘనంగా ఉన్నా ఆచరణలో మాత్రం అధ్వానంగా మారింది, ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలు గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు, గత ప్రభుత్వం అల్లాదుర్గం మండలంలోని 16,గ్రామ పంచాయతీల్లో, ఒక్కో డంపింగ్ యార్డ్ కోసం రూ.2.5,లక్షలను వెచ్చించింది రూ.40.లక్షల వ్యయంతో అన్ని గ్రామాలలో నిర్మాణం పూర్తి చేయడంతో పాటు, ట్రాక్టర్లను కేటాయించింది తడి చెత్తను పొడి చెత్తను వేరుచేసి సేంద్రీయ ఎరువుల తయారీ కోసం షెడ్లను నిర్మించింది, ఇప్పుడు ఈ నిర్వహణ సక్రమంగా లేక లక్ష్యం నీరుగారి పోతోంది, ప్రతిరోజు ఉదయం గ్రామాలలో ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేవారు కానీ ప్రస్తుతం అన్ని గ్రామాలలో తూతూ మంత్రంగా చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చెత్తను రోడ్డు పక్క గుంతల్లో సమీప వాగుల్లో ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు, దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి లక్షల రూపాయలు ప్రజాధనం కేటాయించిన ఈ ప్రభుత్వం అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు చెత్త నిర్వహణను సక్రమంగా చేపడితే పల్లెలు స్వచ్ఛతతో మెరుగు పడడంతో పాటు మరికొంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెబుతున్నారు, ఇప్పటికైనా ఉన్నత అధికారులు ప్రత్యేక చొరవ చూపి పారిశుద్ధ్య నిర్వహణను సక్రమంగా చేపట్టేల చర్యలు తీసుకోవాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు..
