భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి05 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల సందర్బంగా లక్ష్మీదేవిపల్లిలోని నలంద జూనియర్ కళాశాల నందు గల పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సందర్శించారు.అక్కడ విధులలో ఉన్న అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లావ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు మరియు ఎస్సైలు నరేష్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు