ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 05 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ముల్కల్లగూడెం కు చెందిన ముల్కల్ల సత్యనారాయణ అనే 44 సంవత్సరాల వ్యక్తి ఈత రాక ప్రమాదవశాత్తు గోదావరి నీటిలో మునిగి మృతి చెందాడు.మృతుడు కాగజనగర్ ఎస్సి వసథిగృహంలో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. మంగవారం రోజున ఉదయం గోదావరి నదికి స్నానంకోసం వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడు. మృతుని భార్య సుమలత పిర్యాదు మేరకు ఎస్సై-2 రామయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. లక్షెట్టిపేట ఎస్సై పి సతీష్ తెలుపారు.