ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 28 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని 43 వ డివిజన్ నెహ్రూ నగర్ నందు సోమవారం ఉదయం ఖమ్మం అంబులెన్స్ ఓనర్స్ మరియు డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ఓనర్స్ మరియు డ్రైవర్స్ యూనియన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు,కార్పొరేటర్ బి.జీ క్లైమేట్.
: అనంతరం అంబులెన్స్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు ముఖ్యఅతిథిలకు శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి పాల్వంచ కృష్ణ, ఖమ్మం అంబులెన్స్ ఓనర్స్ & డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు చింతల వినయ్,ఉపాధ్యక్షులు పోలిశెట్టి ఉపేందర్,ప్రధాన కార్యదర్శి చింతల రవి, కార్యదర్శి మందపల్లి రాము,జాయింట్ సెక్రెటరీ చట్టు రాజేష్ మరియు అంబులెన్స్ ఓనర్స్ & డ్రైవర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..