నిర్మల్ జిల్లా సోమవారం దాస్తూరాబాద్ మండలం గోండు గూడ లోపర్యటించిన లాల్ బహూదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ డైరెక్టర్ ను నృత్యాలు ఊరేగింపులతో ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నూతనంగా శిక్షణ పొందు తున్న ట్రైనీ ఐఏఎస్ లతో కలిసి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ డైరెక్టర్ కే.శ్రీనివాస్ జిల్లా లోని దస్తురబాద్ మండలం లోని గోండు గూడ గ్రామం లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 1982 లో ఈ ప్రాంతం లో పర్యటిం చానని మళ్లీ 41 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావడం జరిగిందన్నారు. ఈ 41 ఏళ్లలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, పచ్చదనం తో కళకళలాడుతుందని అన్నారు.ముఖ్యంగా తాము ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణం, వారి జీవన విధానం, అలవాట్లు, వారికి ఉన్న సమస్యలు తెలుసుకొని తద్వారా భవిష్యత్తు లో ఏ విధంగా గా నడుచుకోవాలో శిక్షణ పొందుతు న్న ఐఏఎస్ లకు తెలుస్తుందన్న ఉద్దేశ్యం తో రావడం జరిగిందని అన్నారు
ఈ సందర్బంగా గ్రామం లో ఏవైనా సమస్యలు ఉంటే
మొహమాటం పడకుండ గ్రామం లో పర్యటిస్తున్న ఐఏఎస్ లకు తెలియజేయాలని అన్నారు.దేశం లో మొత్తం 11 రాష్ట్రాలలోని 44 జిల్లా లలో శిక్షణ పొందు తున్న ఐఏఎస్ లు పర్యటిస్తున్నారని, అందులో భాగం గానే నిర్మల్ జిల్లా కు విచ్చేయడం జరిగిందని అన్నారు. మొత్తం 14 మంది ట్రైని అధికారులు జిల్లాకు వచ్చారని, పెంబి లో 7 గురు, గోండు గూడ లో 7 గురు ఉన్నారని తెలిపారు.
తాను ఈ గ్రామం లోకి విచ్చేస్తున్న సమయం లో చిన్నారుల సంప్రదాయ గోండు నృత్యాలు తనని ఎంతో ఆకట్టుకున్నాయని, అలాగే గోండు పెయింటింగ్స్ కూడా చాలా అందం గా ఉన్నాయని,ఈ పైంటింగ్స్ కి గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పెంబి మండల కేంద్రంలో శిక్షణ ఐఏఎస్ అధికారులను కలిసిన జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి.తమకు అప్పగించిన బాధ్యతలను గ్రామస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశం.శిక్షణ ఐఏఎస్, పాలనాధికారికి గుస్సాడి.నృత్యాలతో ఘన స్వాగతం పలికిన అధికారులు ప్రజాప్రతినిధులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking