ప్రజావాణిలో వచ్చే అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 28:
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరి ప్రియా , లా ఆఫీసర్ చంద్రావతి తో కలిసి ప్రజల నుండి వివిధ సమస్యలపై 96 ఆర్జీలను స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆయా అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking