మాజీ మంత్రి రవీంద్ర నాయక్
కేసీఆర్ గిరిజన జాతిని మోసం చేశారని,కాళేశ్వరం ప్రాజెక్టు ఏటిఎం మిషన్ నుంచి ఓటర్లకు డబ్బులు ఇచ్చే పేటీఎంగా మారిందని
జాతీయ వడ్డెర,గిరిజన సంచార జాతుల సంఘం ముఖ్య సలహాదారు,బీజేపీ జాతీయ కౌన్సిల్
సభ్యుడు, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ఆరోపించారు.సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కేసీఆర్ గిరిజన జాతిని మోసం చేశారని,పార్టీలో ఉన్న ఒక మహిళా ఎమ్మెల్యే,మహిళా మంత్రి ఇద్దరూ పార్టీ నుంచి బయటికి రావాలన్నారు.గడిచిన ఎన్నికల్లో అధికార పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక
ఏటిఎం మిషన్ లా ఉపయోగ పడగా, ప్రస్తుతం ఓటర్లకు డబ్బులు ఇచ్చే పేటీఎంగా మారిందన్నారు.పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో
అవినీతి, అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.ప్రశ్నించే వారి గొంతును
నొక్కేస్తున్నారని,అణిచివేస్తున్నారని ఆరోపించారు. తమకు అన్యాయం జరుగుతోందని ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే,ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెడుతున్నారన్నారు.రాష్ట్ర గవర్నర్ కు కూడా ప్రోటోకాల్ పాటించడం లేదని, గడిచిన రెండు సంవత్సరాలుగా తిప్పలు పెడుతున్నారన్నారు.ఆయనను సీఎం అనాలంటే సిగ్గనిపిస్తుందన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క పని చేయలేదని,2001లో ఏమి లేని ఆయనకు లక్షల కోట్లు ఎలా వచ్చాయన్నారు.ఎల్బీనగర్ లో గిరిజన మహిళపై
దాడికి పాల్పడి చిత్రహింసలకు గురిచేసిన పోలీస్ అధికారులను,డీసీపీని సర్వీస్ నుంచి తొలగించాలన్నారు.గిరిజన మహిళపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖ మంత్రి,తదితరులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.కేసీఆర్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడితే, జిల్లాలో మంత్రులు, నియోజకవర్గాల లో ఎమ్మెల్యేలు వెయ్యి, వందల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్నారు.గిరిజనుల పై దాడులు జరుగుతున్నా,వేధింపులకు పడుతున్నా,యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించని ట్విట్టర్ పిట్ట ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని భూములను ఒక పథకం ప్రకారం మాయం చేస్తున్నారన్నారు.ఆయన కన్నా ముందు నేను ఎమ్మెల్యే, మంత్రిని అయ్యాను,ఆస్తులు ఏమి లేవు, నా తరువాత ఎమ్మెల్యే అయిన ఆయనకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నమ్మిన వారిని నట్టేట ముంచే దుర్మార్గుడు కేసీఆర్ అని, నన్ను కూడా ముంచాడని, ఆయన ప్రభుత్వం సమాధి అయ్యేవరకు నిద్రపోనన్నారు.
కేసీఆర్ అవినీతి మీద నోరువిప్పడం లేదని ఆరోపించారు. ఆయన అవినీతిపై దర్యాప్తు సంస్థలు స్పందించాలని డిమాండ్ చేశారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఏమి తప్పుచేసిందని,అసెంబ్లీలో నిన్ను సేవాలాల్ తో పోల్చింది ఆమెకు,మంత్రి సత్యవతి రాథోడ్
నీ పేరును చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుందన్నారు.గిరిజనులను మోసం చేసిన పార్టీలో ఉన్న వారిద్దరూ బయటికి రావాలన్నారు.బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటి కాదు, వేరువేరన్నారు.గిరిజనులు 10 శాతం రిజర్వేషన్లకు అర్హులన్నారు.తాగుబోతుకు పాలాభిషేకాలు ఎందుకన్నారు.ఇప్పటికైనా గిరిజనులు కళ్ళు తెరవాలన్నారు.