ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను వేగవంతం చేస్తాం

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 28:
సోమవారం హైదరాబాద్ నుండి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వాతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు, తెలంగాణకు హరితహారం, ఆసరా ఫించన్, గొర్రెల పంపిణీ, బీసి, మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గృహలక్ష్మి ,దళిత బంధు, ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, కారుణ్య నియామకాలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ వంటి పలు అంశాలపై జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.
అనంతరం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు, సలహాలను పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అమలు పరుస్తున్నామని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు జిల్లాలో వందశాతం లక్ష్యం సాధించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణకు హరిత హారం లో లక్ష్యం మేరకు మొక్కలు నాటడం జరుగుతుందని, రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని సైతం విజయవంతం చేయడం జరిగిందన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం పై మాట్లాడుతూ లక్ష్యం మేరకు గొర్రెలు సేకరించి పంపిణీని చేయడం జరుగుతుందన్నారు. బి.సి., మైనారిటీ సంక్షేమ పథకాలు జిల్లాలో లబ్ధిదారులను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి లబ్ధిదారులను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే లక్ష్యం మేరకు పరిపాలన మంజూరు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. గృహలక్ష్మి పధకం క్రింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో కారుణ్య నియామకాలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.
ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి,జిల్లా రెవెన్యూ అధికారి హరి ప్రియా , జిల్లా స్థాయీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking