గద్దర్ ఆశయాలు కొనసాగిస్తాo.

 

గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు.

తూప్రాన్ లో గద్దర్ సంస్మరణ సభ

తన స్వంత ఊరులో కళాకారులు,కవులచే గద్దర్ను స్మరిస్తూ ఆటాపాటా.

మెదక్ తూప్రాన్, ఆగస్ట్,28. :-

మెదక్ జిల్లా తూప్రాన్ వాస్తవ్యులు హైకోర్టు న్యాయవాదులు మానవ హక్కుల సంఘం డైరెక్టర్ ఎండ్రెల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు మన్నే శ్రీనివాసరావు అంబేద్కర్ సంఘం అధ్యక్షతన తూప్రాన్ గద్దర్ ప్రముఖ గాయకులు అలియాస్ విట్టల్ సంతాప సభ , (సంస్మరణ సభ) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ గాయకులు , ప్రజా ప్రతినిధులు సభలో పాల్గొన్నారు. తూప్రాన్ లో గద్దర్ స్మృతి వణం ఏర్పాటు చేసి తూప్రాన్ ముద్దు బిడ్డ ప్రజా యుద్ద నౌక గద్దర్ ఆశలు, ఆశయాలు కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తూప్రాన్ లో ఏర్పాటు చేసిన గద్దర్ సంస్మరణ సభ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ యాస భాష తో గ్రామీణ పల్లెటూరు ప్రజలు పడ్తున్న భాధలు,కష్టాలు తన పాట ద్వార యావత్ ప్రపంచానికి చాటిన ఘనత గద్దర్ కే దక్కుతుందని అన్నారు. గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ నాన్న విడిచిన తూటా లాగా ప్రజలను చైతన్య పరిచేందుకు నిశబ్ద విప్లవం కొనసాగిస్తానని, ఓట్ల విప్లవం తో మార్పు సాధిస్తానని అన్నారు.అనంతరం ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది తూప్రాన్ ముద్దు బిడ్డ ఎనరెల్లి వెంకటస్వామి మాట్లాడుతూ గద్దర్ పాట శాశ్వతమని అందుకే గద్దర్ విగ్రహాలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వాడ,వాడల, ఊరూరా, అలాగే ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని కోరారు. గద్దర్ సతీమణి విమలకు గద్దర్ స్మృతిలో భారత రత్న అవార్డు ఇచ్చి గుర్తించాలని డిమాండ్ చేశారు. తూప్రాన్ లో గద్దర్ అన్న విగ్రహం ఏర్పాటు కు తన సంపూర్ణ ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రముఖ నేపథ్య గాయకురాలు మధు ప్రియ మాట్లాడుతూ తన ఆరేళ్ల ప్రాయంలో వెంటేసుకుని ఊరూరా తిప్పుతు గజ్జకట్టి పాట పాడి తనను ఈ స్థాయికి తిసుకోచ్చిన పాత జ్ఞాపకాలు పాట రూపంలో వినిపించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ ఐలయ్య, జయరాజు, పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ జానకిరాం సి ఆర్, గడ్డం ప్రశాంత్ కుమార్,మామిడి వెంకటేష్, మన్నే శ్రీనివాస్ రావు, అనిల్, సామల అశోక్, ఆంజనేయులు,గాదె ఇన్నయ్య, జే.పి రాజ్, మాసాయిపేట యాదగిరి, బాల్ రాజ్ గౌడ్, వరంగల్ శ్రీను,ఎస్.వై.అశోక్, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్,వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్ లు కోడిప్యాక నారాయణ గుప్త, మామిండ్ల కృష్ణ, బొంది వెంకట్ గౌడ్, రవీందర్ రెడ్డి,భైరం సత్య లింగం
కూర్మ శ్రీశైలం, సతీష్ చారి, సుధాకర్ ,తిమ్మాపురం నరసింహులు, సిందేచంద్రం, పసుల నర్సింలు, గజ్జెల్లి బిక్షపతి, గజ్జెళ్ళి కృష్ణ, ఎంఆర్ పిఎసిఎస్ మండల అధ్యక్షులు సర్గల రాములు, ఏర్పుల బాల్ రాజు ,లక్ష్మణ్ ,సర్గల శ్రీనివాస్,అనిల్, యాదగిరి, బురాన్ బాయ్,సమీర్ , సతీష్ , అహ్మద్, ,హాజరు , కళాకారులు , ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking