పెరిగిన దివ్యాంగుల పెన్షన్ ప్రారంభం బ్రాంచి పోస్ట్ మాస్టర్ తిరుపతి రెడ్డి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 28 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్ 3016రూపాయల నుండి 4016కు పెంచడాన్ని హర్షిస్తూ పెరిగిన పెన్షన్ ను సోమవారం మండలంలోని గుల్లకోట గ్రామంలో గ్రామ సర్పంచ్ గోళ్ళ రవీందర్,ఉప సర్పంచ్ మల్లేష్,పంచాయతీ కార్యదర్శి సురేష్,గ్రామ కమిటీ ఇంచార్జి రాజారెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ…పోస్టల్ సేవలను గ్రామ ప్రజలకు వివరించారు.అన్ని రకాల ఇన్సూరెన్సు సేవలు,సేవింగ్ బ్యాంక్ ఖాతా,నెలవారీ పొదుపు ఖాతా,సుఖన్య సమృద్ధి ఖాతా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్,రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, మనీ ట్రాన్స్ఫర్,మనీ విత్ డ్రాల్ ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబర్స్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking