దోమల నివారణకు చర్యలు చేపట్టాలి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏండీ ఆరిఫ్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 28 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీలో పెరుగుతున్న దోమల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఏండీ ఆరిఫ్,జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ మాట్లాడుతూ… మున్సిపాలిటిలో పందులు విపరీతముగా పెరిగిపోయినవని, పట్టణమునకు 5 కిలో మీటర్ల దూరములో పెంచాలని ప్రభుత్వ నిబంధనాలున్నా పట్టించుకోవడం లేదన్నారు. వీటి వలన విషజ్వరాలు, డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్ లాంటి ప్రాణాంతక రోగాల భారీన ప్రజలు పడుతున్నారన్నారు. ప్రజలు వేలల్లో,లక్షల్లో హాస్పటల్ బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరన్నారు. పట్టణంలో విచ్చల విడిగా తిరుగుతున్న కుక్కలు, కోతుల వల్ల పట్టణ ప్రజలు తీవ్ర భయందోళనలకు గురవుతున్నారన్నారు. వెంటనే దోమల నియంత్రణ కు ఫాకింగ్ చేయాలనీ, కుక్కలు,కోతులను పట్టణానికి దూరంగా పంపించేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాందేని చిన్న వేంకటేష్,నాగార్జున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking