కాంగ్రెస్‌కు మద్దతు కోసం చాలా పార్టీలు ముందుకొస్తున్నాయి: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే

 

హైదరాబాద్, ఆగస్ట్ 28కాంగ్రెస్‌కు మద్దతు కోసం చాలా పార్టీలు ముందుకొస్తున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. తెలంగాణలో ఏ పార్టీతో కూడా పొత్తులపై ఇంకా చర్చలు ప్రారంభం కాలేదని చెప్పారు. వామపక్షాలతో పొత్తు గురించి స్పందించిన పీసీసీ చీఫ్, సీఎల్పీ అధినేత లేకుండా కాంగ్రెస్​ పార్టీ చర్చలు జరపదని స్పష్టం చేశారు.వామపక్షాలతో పొత్తుల విషయమై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి చర్చలు జరగలేదని.. స్పష్టం చేశారు. పొత్తులు అనేవి విధానపరమైనవని తెలిపారు. ఇది పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత లేకుండా జరగవని వెల్లడించారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో.. తాను మాట్లాడడం సర్వసాధారణమనివ్యాఖ్యానించారు. మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పొత్తులపై తనను నేరుగా చర్చలు జరపమని హైకమాండ్ చెప్పలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేందుకు చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే మందకృష్ణ మాదిగ, ఆర్.కృష్ణయ్య, ఇతర సంఘాల నేతలు కూడా వచ్చారని వివరించారు. కానీ తనను కలిసిన తర్వాత.. వారు ఏదో మాట్లాడితే.. తాను చేసేది ఏముందన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో తమకు ఒక విధానం ఉంటుందని.. దాని ప్రకారమే ఎంపిక చేస్తామని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ వాళ్లు మనవాళ్లే.. వారినేం అనొద్దు.. మనమే వాళ్లనుపంపించాం’పొత్తుల విషయంలో ప్రాథమికంగా తనతో పాటు.. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, ఇతర సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. కానీ తుది నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుందని వివరించారు. ఈ క్రమంలోనే సీపీఐతో అనధికారంగా సమావేశం జరిగినట్లు తెలిపారు. ఇందులో పొత్తుల గురించి, సీట్ల గురించి గానీ చర్చ జరగలేదని వివరించారు. మరోవైపు షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో విలీనం గురించి మాట్లాడుతూ.. విలీనం అనేది తన పరిధిలోని అంశం కాదని చెప్పారు.ఈ ప్రతిపాదన గురించి కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు సాధ్యమైనంత ఎక్కువ సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు.. పీఏసీ సమావేశంలో ప్రతి పార్లమెంట్‌ పరిధిలో.. రెండు బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వారికి కేటాయించే సీట్లపై పార్టీలో కసరత్తు జరుగుతోందని వివరించారు. ఈ క్రమంలోనే ప్రధానంగా మరో మూడు డిక్లరేషన్లు ప్రకటించాల్సి ఉందని… అందులో ఓబీసీ మహిళా మైనారిటీ విభాగాలకు డిక్లరేషన్ల ప్రకటన ఉంటుందని వివరించారు

 

Leave A Reply

Your email address will not be published.

Breaking