స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ఈ.వి.ఎం.లు

జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే15 : లోక్ సభ ఎన్నికలు 2024 లో భాగంగా 002 పెద్దపల్లి(ఎస్.సి) పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని 002 చెన్నూర్(ఎస్ సి),003 బెల్లంపల్లి (ఎస్ సి) 004 మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ నేల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో జూన్ 04 తేదీన కౌంటింగ్ కార్యక్రమం ఉంటుందని, ఈ క్రమంలో స్ట్రాంగ్ రూమ్ లలో ఈ.వి.ఎం రక్షణ కొరకు పటిస్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఋధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల లోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో గల స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి గంగారం, హాజీపూర్ తహాశిల్దార్ సి. సతీష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…లోక్ సభ ఎన్నికలలో భాగంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిందని,జూన్ 04 వ తేదీన కౌంటింగ్ కార్యక్రమం కొరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగుతుందిని,కంట్రోల్ రూమ్,మీడియా సెంటర్ లను ఏర్పాటు చేసి పరిరక్షించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking