అక్రమ సంబంధం నేపథ్యంలో వ్యక్తి హత్య..

 

మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ గ్రామానికి చెందిన అక్రమ సంబంధం నేపథ్యంలో మల్యాల నరేష్ (32) అనే వ్యక్తి మంగళవారం రాత్రి హత్యకు గురికాబడ్డాడు.అదే గ్రామానికి చెందిన ఆసాధి చైతన్య బండరాయితో మోది హత్య చేసినాడు.చైతన్య సోదరితో నరేష్ అక్రమ సంబంధం పెట్టుకొని తరచూ కలుస్తుండడం తో చైతన్య పగ పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి కూడా నరేష్ ,చైతన్య సోదరి ఇంటి వద్ద కనబడం తో కోపోద్రిక్తుడైన చైతన్య నరేష్ ను నెట్టడం తో కింద పడ్డాడు. వెంటనే పెద్ద బండరాయితో నరేష్ తల పై మొదడం తో తీవ్ర రక్త స్రావం అయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై సురేశ్ లు సంఘటన స్థలానికి చేరుకున్నారు.మృతుని తండ్రి మల్యాల నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.

Leave A Reply

Your email address will not be published.

Breaking