ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలి నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ధాన్యం కొనుగోళ్లు, వర్షాల వలన రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలు, సి ఎం ఆర్ సరఫరా తదితర అంశాల పై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు తేలేత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, క్లినింగ్ మిషన్, గన్నీ బ్యాగ్స్ ఏర్పాటు చేయాలనీ సూచించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని, తరలింపుకు అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో కేంద్రాలను పర్యవేక్షించి రోజూ వారి రిపోర్టులను సమర్పించాలని, విధులపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సీఎంఆర్ సరఫరా పై మిల్లుల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీఎస్ వో నందిత, డీఎం సివిల్ సప్లైయిస్ శ్రీకళ, డీసీవో నర్సయ్య, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, మార్కెటింగ్ ఏడీ అశ్వాక్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking