డా.బి.ఆర్.అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బెషరత్తుగా క్షమాపణ చెప్పాలని,కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20 : మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బెషరత్తుగా క్షమాపణ చెప్పాలని,కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, పూల మాలలు వేశారు. శుక్రవారం ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకురాలు,యువజన కాంగ్రెస్ నాయకులు,అన్నీ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking