ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులు సరికాదు

 

-పట్టణ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు మొయ్య రాంబాబు

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 20 :

ఆటో జేఏసీ పిలుపుమేరకు చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరి వెళ్తున్న ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేయడం తగదని పట్టణ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మొయ్య రాంబాబు అన్నారు. శుక్రవారం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మందమర్రి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ను మందమర్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అరెస్టు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ లు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దని మన హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికి అయినా సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో సంఘాల నాయకులతో చర్చించి ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేసారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆటో డ్రైవర్లు బత్తిని రాజేష్, బొల్లు రవి, రాజ్ కుమార్, సారయ్య, గోవిందుల శంకర్, ఎస్కే గౌస్, బండారి మల్లేష్, బండారి శంకర్, కట్టప్ప లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking