-సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 20:
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీల అమలు కోసం, కార్మిక వర్గ వ్యతిరేక లెబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిఐటియు ఆఫీసులో అన్ని రంగాల కార్మికులతో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపించిన, అమలులో మాత్రం వారిని బానిసలు చేసే విధంగా చట్టాలను చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల ఫలితంగా కార్పొరేట్లకు పూర్తిస్థాయిలో కార్మిక వర్గాన్ని బానిసలను చేసే విధంగా లేబర్ కోడ్ లను తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే 12 గంటల విధానాన్ని, యూనియన్లు కార్మిక వర్గానికి దూరం చేసే కుట్రలకు తెర లేపడానికి కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ప్రకటన చేయకపోవడం పరోక్షంగా బిజెపి మోడి విధానానికి మద్దతు తెలుపటమే అవుతుందన్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 73 షెడ్యూల్ పరిశ్రమలకు కనీస వేతనాల జీవోలను గెజిట్ చేయకుండా అర్ధాకర్లో కార్మిక వర్గాన్ని నెట్టుతు, వారి శ్రమను కార్పొరేట్లకు ఖజాన నింపుతున్నారన్నారు. ఈ విధానాలపై కార్మిక వర్గం ఐక్యంగా, ఐక్య పోరాటాలతో ముందుకు రావడమే ఈ విధానాలను తిప్పి కొట్టే ఆయుధం అని తెలిపారు. అనంతరం సిఐటియు మండల కమిటీ ఎన్నికున్నారు. మండల కన్వీనర్ గా బెజ్జల రమేష్ సభ్యులుగా వి. నిర్మల, పెసర స్వరూప, గడిగొప్పుల రాజేశ్వరి, ఎం. మహేందర్, గంధం రవి, పెద్ద లచ్చన్న, భూమిక తిరుపతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.