ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 20:
ఇల్లు లేని నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. గణపతి శుక్రవారం పట్టణంలోని వార్డ్ నెంబర్ 21 లో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఆన్లైన్ లో నమోదు చేయడాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సరైన సమాచారం నమోదు చేయాలని ఆయన కోరారు. సరైన పేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నీలిగొండ వెంకటేశ్వర్లు, రెవిన్యూ ఆఫీసర్ పి. కృష్ణ ప్రసాద్, 21 వ వార్డు ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ డి. లక్ష్మీ రాజు మరియు ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.