“మోడీ హటావో దేశ్ బచావో” అనే నినాదంతో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

ఆమ్ ఆఫ్ ది పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు మరియు కన్వీనర్ ఆఫ్ ది ఆర్గనైషనల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డాక్టర్ సుధాకర్ అధ్యక్షతన  ఈరోజు 09-04-2023 సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో “మోడీ హటావో దేశ్ బచావో” అనే నినాదంతో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అఖిలభాక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుండి మల్లు రవి గారు MRG వినోద్ రెడ్డి, ఉపాధ్యక్షులు టిపిసిసి  , ఎస్ఎల్ పద్మ CP ML ప్రజా పంథా పార్టీ నుండి తదితరులు హాజరయ్యారు.

 

డాక్టర్ దిడ్డి సుధాకర్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభిస్తూ, ఈ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ని అసలు  సమస్యలన్నీ పక్కనపెట్టి, దైవభక్తి దేశభక్తి పేరుతోటి దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చి ఈ దేశమంతా ఒకే మతానికి చెందిందన్నట్టుగా మిగతా అందరిని దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి ఢిల్లీలో మంచి విద్య, వైద్యం అందిస్తున్న ఇద్దరు మంత్రులు సిసోడియా, సత్యేంద్ర జైన్ లను జైల్లో పెట్టారని అన్నారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణకి కాలేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదు. కోచ్ ఫ్యాక్టరీకి నో చెప్పారు. పసుపు బోర్డుకి వాగ్దానాలు చేసి మొండి చేయి చూపెట్టారు. మెట్రో రెండోదశకి నిధులు ఇవ్వలేదు. ఐటిఆర్ ప్రాజెక్టు దిక్కులేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కి నోచుకోలేదు.

రాష్ట్రం నుండి కేంద్ర ఖజానాకు వెళుతున్న నిధుల నుండి కూడా మన రాష్ట్రానికి చెందిన వాటాలను ఇవ్వడంలో కూడా కేంద్ర ప్రభుత్వం వివక్షను చూపెడుతోందని అన్నారు. ఇలా చెప్పుతో పోతే చాలా విషయాలని, ఇటువంటి ప్రభుత్వం మన కేంద్రంలో అవసరమా అంటూ “మోడీ హటావో దేశ్ బచావో” అన్న నినాదాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చిందని ఆ పిలుపుకి అన్ని ప్రతి పక్షాలు కలిసి దేశంలో మోడీని గద్దదించాల్సిన అవసరం ఉందని అందుకే అందర్నీ కలపడానికి ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు.

టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ నరేంద్ర మోడీ మీద మాకేమీ వ్యక్తిగత ద్వేషం లేదని, ఆయన మన ప్రధాని అని కానీ ఆయన ప్రధాని లాగా వ్యవహరించకుండా ఒక పార్టీకే చెందిన ప్రధాని లాగా దేశంలో వ్యవహరిస్తున్నాడని ప్రజాస్వామ్య పద్ధతిలో దేశాన్ని పాలించాల్సిన ప్రధాని తమ పార్టీ బలాన్ని పెంచుకోవడానికి అడ్డదారుల్లో 8 రాష్ట్రాల ప్రభుత్వాన్ని కూల్చడం, అలాగే దేశంలో తనను వ్యతిరేకిస్తున్న వారిని ఈడీలు సిబిఐ లు ఐటి లని అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలతో తమ పార్టీలో చేర్చుకోవడం వంటివి  చేస్తున్న ప్రధాని మనకు అవసరమా అని ప్రశ్నించారు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ మోడీ హటావో దేశ్ బచావో అన్న నినాదాన్ని ఈ రాష్ట్రంలో తీసుకెళ్లటానికి కాంగ్రెస్ పార్టీ తనవంతు భాగస్వామ్యాన్ని అందిస్తుందని తెలియజేశారు

సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఎస్ఎల్ పద్మాగారు మాట్లాడుతూ ఈ దేశంలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, యువతరాన్ని పక్కదోవ పట్టించడంలో అగ్రభాగాన నిలిచిన బిజెపి అధినాయకుడు మోడీని ఈ దేశ అధికారం నుంచి దింపాల్సిన తక్షణ అవసరం ఉందని, ఇటువంటి మోడీ మరొకసారి అధికారంలో వస్తే గనుక ఈ దేశంలో ప్రజాస్వామ్యం మంటగలుస్తుందని, భారత రాజ్యాంగాన్ని మార్చేసి   మనుస్మృతి  ని రాజ్యాంగం గా తీసుకొస్తారని ఇటువంటి పరిస్థితుల్లో ” మోడీ హటావో దేశ్ బచావో ” ఉద్యమం గ్రామ గ్రామాన తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ మొదలుపెట్టిన ఈ ఉద్యమంలో మేము కూడా భాగస్వాములము అవుతామని తెలియజేశారు.

 

పార్టీ కోర్ కమిటీ సభ్యులు బుఖ్య శోభన్ బాబు,  బుర్ర రాములు గౌడ్,  మాజీద్, అబ్దుల్ ముక్తదీర్, డాక్టర్ సోలమన్ రాజు, డాక్టర్ హరి చరణ్, పాండురంగయ్య, వికాస్ రెడ్డి, అప్స పరీక్షలు రాజ్, సర్దార్ రణధీర్ సింగ్ రానా, మెహమూద్ అలీ వందన సమర్పణ చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking