మార్మోగిన శ్రీరామ జపం.
శోభాయాత్ర ర్యాలీలు అన్నదాన కార్యక్రమం.
రాముని నామం స్మరిస్తే ముక్తి లభిస్తుంది .
హనుమాన్ భక్త బృందం సభ్యులు.
మెదక్ మనోహరాబాద్ జనవరి 22 ప్రాజబలం న్యూస్:-
అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలను పురస్కరించుకొని శ్రీరామ
బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డి పేట గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో హనుమాన్ భక్తబృందం సమక్షంలో ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు, శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రంతో భజన భక్తి గానంతో లింగారెడ్డిపేట గ్రామం భక్తి పరవశంతో హనుమంతునికి , చందనాభిషేకం , పంచామృత అభిషేకాలు పూజలు నిర్వహించి శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలకు అభిషేకాలు , విశేష పూజలు నిర్వహించారు.
జనమంతా రామమయం లింగారెడ్డి గ్రామంలో ఊరూర వైభవతంగా వేడుకలు.
శోభయాత్రులు అన్నదానాలు.
మార్మోగిన శ్రీ రామ జపం
లింగారెడ్డి పెట్ గ్రామంలో అయోధ్య నుండి వచ్చిన
శ్రీ సీతారాముల కరపత్రాలు పంచుతూ రాత్రి వరకు నిరంతరాయంగా రామనామ సంకీర్తనలు. పారాయణలు సాయంత్రం ప్రత్యేక పూజలు భజనలు, మహిళల కోలాటాలు, దీపారాధన , భరతనాట్యం కళ్ళు జిగేల్ మనిపించేలా వేడుకలు నిర్వహించారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ వినాధలతో ఇంటింటా దీపాలతో పండుగ వాతావరణం కనిపించింది.
ఎల్ఈడి టీవీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటుచేసి గ్రామస్తులకు నిర్వాహకులు అయోధ్యలో జరుగుతున్న శ్రీ బాల రాముడు రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను చూపించి మన దేశ సంస్కృతి , మానవ మనుగడకు కావలసిన మంచి విషయాలను గ్రామస్తులకు ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేసి వివరించారు. అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం గ్రామస్తులు కనులారా వీక్షించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
అనంతరం ప్రభాకర్ గుప్తా గ్రామస్తులు మాట్లాడుతూ
లింగరెడ్డిపేట్ గ్రామస్తులు మందరం కలిసికట్టుగా ఉండి శ్రీరాముని యొక్క కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమం వల్ల గ్రామస్తులందరం
ఐక్యతతో ఉండి ,
మా గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి పథంలో ముందుఉంచుతామని, ఇకపై మా గ్రామస్తులమందరం కలిసి కలిసికట్టుగా ఉండి దైవ కార్యక్రమాలు చేపడుతూ గ్రామాన్ని గ్రామ ప్రజలను అభివృద్ధి పథంలో , తీసుకువెళ్తామని మానవ మనుగడకు దైవ కార్యక్రమం వల్ల మంచి లక్షణాలు ఏర్పడతాయని, ఈరోజు గ్రామస్తుల ఐక్యతలతో శ్రీరాముని అనుగ్రహంతో గ్రామంలో విశేష పూజలు నిర్వహించి, స్వామివారి రథోత్సవం, పల్లకి సేవ, శ్రీ సీతారామ విగ్రహాలకు విశేష పూజలు, మా గ్రామంలో ఇంటింట దీపాలు వెలిగించి మహా పండుగల వాతావరణం నెలకొందని అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఇది మా గ్రామ ప్రాజల ఐక్యతకు నిదర్శమని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రామనామం స్మరిస్తే చాలు మానవునికి ముక్తి లభిస్తుంది అని గ్రామ పెద్దలు తెలిపారు. మానవ సమాజంలో మంచిని గ్రహించాలనేది పరమార్థమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలన్నరు. ఇల్లు ఆలయాలు మందిరాలు శ్రీ రామనామ గానంతో పరవశించాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు హనుమాన్ భక్త బృందం సభ్యులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
