స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్
ఖమ్మం ప్రతినిధి జనవరి 22 (ప్రజాబలం) ఖమ్మం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరం ‘‘గ్రీవెన్స్ డే’’లో అర్జీదారుల నుండి దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యలకై ఎండార్స్ చేశారు. మద్దెల సంఘవి తన ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన నాటి నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు న్నారని వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించి ఆదుకోగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా ప్రబుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులకు సూచించారు. వైరా మండలం సిరిపురం గ్రామానికి చెందిన తడికమల్ల స్వర్ణలత తన భర్త ఆరోగ్య శ్రీలో నెట్‌వర్క్ మిత్రగా పనిచేస్తూ మార్చి,2021లో అనారోగ్యంతో మరణించారని, తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వారి ఫోషణ, చదువులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుచున్నదని తన భర్తకు సంబంధించిన ఉద్యోగం ఆరోగ్యశ్రీలో తనకు అవకాశం కల్పించగలరని సమర్పించిన దరఖాసును తగు చర్య నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. చింతకాని మండలం ప్రోద్దుటూరు గ్రామంకు చెందిన ఎస్.కె.జాన్‌సాహెబ్ తాను వికలాంగుడనని 75 శాతం అంగవైకల్యంకు సంబంధించి సదరం సర్టిఫికేట్ పొంది యున్నానని ఆసరా పింఛను మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును, ఖమ్మం నగరం తుమ్మల గడ్డకు చెందిన ఎస్.కె.యాకూబ్‌పాషా తనకు ఎడమ చేతి అంగవైకల్యం 72 శాతం కల్గి ఉన్నానని గతంలో సదరం క్యాంపులో 1 సంవత్సరం వరకు మాత్రమే డిజబులిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగినదని, దాని గడువు తీరపోయినందున తన పరిస్థితి పరీక్షించి తనకు శాశ్వత అంగవైకల్యంకు సదరన్ క్యాంపులో సర్టిఫికేట్ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంకు చెందిన దండా మురళి, బేబి ప్రసూనలు రాజేశ్వరపురం రెవెన్యూ సర్వేనెం.465లో తమ పొలంలో మిరప పంట సాగు చేసి జీవనం సాగించటం జరుగుతుందని, అదే సర్వేనెం.లో 2022న అరుణాచల శివ రైస్ మిల్లు మరియు ఫుడ్ ఇండస్రీస్ నిర్మాణము చేయడం వల్లన పొల్యూషన్‌తో మిల్లు నుండి వెలువడే డస్ట్, బూడిద, నీరు వలన పంటపొలముపై పడి పంట తీవ్ర నష్టం జరుగుతుందని ఇట్టి విషయమై వారికి తెలియజేయగా, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తమకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం తహశీల్దారుకు సూచించారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన డి.రాజా తనకు గుర్రాలపాడు గ్రామ రెవెన్యూ పరిధి సర్వేనెం. 9/ఆ/3లో`0.10 కుంట భూమి కలదని తన అనుమతి లేకుండా జెవిడి డెవలపర్ వారు అక్రమ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని తెలసి నేను వారిని అడగడంతో తనపై ఖమ్మం రూరల్ పి.ఎస్‌లో కేసు నమోదు చేసినారని, అట్టి భూమికి సంబంధించి తన వద్ద ప్రభుత్వం వారు జారీచేసిన పాసుపుస్తకము, ఇతర దృవపత్రములు కలవని వాటిని పరిశీలించి తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం తహశీల్దారుకు సూచించారు గ్రీవెన్స్ డేలో జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. వి.వి.అప్పారావు, బి.సి.వెల్ఫేర్ అధికారి జ్యోతి, డి.సి.ఓ.విజయ కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, డి.పి.ఓ. హరికిషన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.