బిజేపీ సంగారెడ్డి జిల్లా నుతన అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన గోదావరి అంజిరెడ్డి

 

సంగారెడ్డి జనవరి 22 ప్రజ బలం ప్రతినిది:
బిజేపీ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరము బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత ను అపచెప్పిన బిజెపి జాతీయ అధ్యక్షులు జే పి నడ్డా కు, మరియు ప్రదాని మోడీ, అమిత్ షా గార్లకు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేస్తున అన్నారు. జిల్లాలోని చిన్న పెద్దా అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని, రాబోయే ఎంపీ పార్లమెంటు ఎన్నికల్లో ముందుండి, మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాలను గెలిచి పార్టీకి బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బిజెపి నాయకులు అనంతరావుకులకర్ణి, జగన్, జైపాల్ రెడ్డి, అంజిరెడ్డి, మహేందర్, రావియాదవు, విజయ్ కుమార్, కంది మండల్ నాయకులు రాములు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking