శ్రీరాముని ప్రతిమకు పూజలు గావించి భజనలు, కీర్తనలు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 22 జనవరి 2024: అయోధ్యలోని మహ మాన్విత శ్రీరామ జన్మభూమి రామమందిర భవ్య క్షేత్రంలోని గర్భగుడిలో చారిత్రాత్మక రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిన సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఐ.టీ పరివార మిలన్ కార్యకర్తలు జ్ఞానేశ్వర్ మైసరి, కిరణ్ కుమార్ మట్టేవాడ, కిరణ్, సరంగ్, రాజూ కటకం, లెనిన్, జగదీశ్, అనిల్, అంజని, హేమంత్, శృతీన్, ఆకాశ్, వీరేంద్ర, రుషికేశ్ మరియూ చురుకుగా పాల్గొన్న స్వంయం సేవకుల ఆధ్వర్యంలో మణికొండ ల్యాంకో హిల్స్ బాటలో గల హనుమాన్ మందిరంలో ఉదయం 10 గంటలకు శ్రీరాముని ప్రతిమకు పూజలు గావించి భజనలు, కీర్తనలు, పాటలు పాడిన తపస్వీ, ఆకుల నిర్వితల మరియూ కూచిపూడి నాట్యం గావించిన వీ. బ్రిందా నాట్యానికి ప్రేక్షకులు మైమరచినారు తదుపరి మధ్యాన్నం 12 గంటల నుండి బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులకు సౌకర్యము గావించడంతో పాటు బుద్దోల్ మీనా ముత్యాలు దంపతులు ఏర్పాటు గావించిన అన్న ప్రసాదాన్ని భక్తులకు సకల సౌకర్యములతో ఏర్పాటు చేసినారు, విచ్చేసిన భక్తులందరు ఇట్టి సదవకాశాన్ని ఉపయోగించుకొని ఆ మహాదేవుడు శ్రీరాముని కృపా కటాక్షములకు పాత్రులైనారని ఈ శుభ సందర్భంలో పుర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, వీ.ఆర్.ఫర్ ట్రస్ట్ సభ్యులు, భక్తులు తది తరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారని కార్య నిర్వాహక సభ్యులు తెలియ జేసినారు. జై శ్రీరామ్.

Leave A Reply

Your email address will not be published.

Breaking