అయోధ్యలోని రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కొర్విచెల్మ గ్రామంలో ఘనంగా వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 22 : అయెధ్యలోని రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కొర్విచెల్మ గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.సోమవారం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో హనుమాన్ భక్తులు,ప్రజలు,స్త్రీలు,అందరూ కలిసి,అయోధ్యలోని రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కొర్విచెల్మ గ్రామంలో శ్రీ సీతారాముల గుడి వద్ద నుంచి గ్రామం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి వాడ వాడకులోని ఇంటి ఇంటికి తిరుగుతూ ఆంజనేయ భక్తులు,గ్రామంలో ప్రజలు,అధిక సంఖ్యలో స్త్రీలు కోలాటం,ఆటపాటలతో ముందుకు సాగుతూ.ఊరేగింపు సాగించారు.అంతేకాకుండా శ్రీ సీతారాముల కలపత్రాలు పంచుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిదానలతో, ఎటుచూసినా అధిక సంఖ్యలో రామ భక్తులు పండుగా వాతావరణంతో అందరూ కలిసికట్టుగా జరుపుకున్నారు.అలాగే ముందుకు సాగుతూ ఈ కార్యక్రమం శ్రీ సీతారాముల గుడి వద్ద ముగించారు. అనంతరం గ్రామంలో ప్రజలు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామంలో ప్రజలు,హనుమాన్ భక్తులు,అధిక సంఖ్యలో స్త్రీలు,తదితరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking