సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ అందిస్తాం

 

మంత్రి తుమ్మల నాగేశ్వరావు

ఖమ్మం ప్రతినిధి జనవరి 22 (ప్రజాబలం) ఖమ్మం సంక్షేమ పథకాల లబ్ది అర్హులైన లబ్ధిదారు లందరికి అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామ పశు వైద్యశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గ రఘునాథపాలెం మండలానికి చెందిన కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ పథక లబ్ధిదారులకు చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకం క్రింద 57 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116 ల చొప్పున రూ. 57,06,612 లను అందజేసినట్లు అన్నారు. ఇందులో ఈర్లపూడి గ్రామానికి చెందిన 24, చిమ్మపూడి గ్రామానికి 5, పాపటపల్లి గ్రామానికి 5, ఎం. చింతగుర్తి గ్రామానికి 9, కోయచిలక గ్రామానికి 5, రఘునాథపాలెం గ్రామానికి 3, వి. వెంకటాయపాలెం గ్రామానికి 3, వేపకుంట్ల గ్రామానికి 2, మంచుకొండ గ్రామానికి చెందిన ఒక లబ్ధిదారులు వున్నారు. వీరిలో ఎస్సి లు 7 గురు, ఎస్టీలు 31 మంది, బిసి/మైనారిటీలు 19 మంది ఉన్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాల్లో మిగులు అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారిణి విజయకుమారి, రఘునాథపాలెం ఎంపిపి గౌరి, ఎంపిడివో రామకృష్ణ, తహసీల్దార్ ఎల్. విల్సన్, ఈర్లపూడి సర్పంచ్ దేవుసింగ్, ఎంపిటిసి జానకిరామ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking