ఖమ్మం ప్రతినిధి జనవరి 22 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక గుట్టల బజార్ నందు శ్రీ రామకృష్ణ విద్యాలయం లో అయోధ్య బాల రామ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనం గా జరిగినాయి . పిల్లలు శ్రీ రామ జయ రామ మంత్రం ని 108 సార్లు ఆచార్యుల తో కలిసి అధ్యాయానం చేశారు . హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగినది . అలాగే పిల్లలకు ప్రతిష్టాపన ముహూర్త సమయానికి ప్రొజెక్టర్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చూపించటం జరిగినది . పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జీ వీ , పాఠశాల విభాగ్ కార్యదర్శి సుబ్బారావు , పాఠశాల రాష్ట్ర శైక్షనిక్ ప్రముఖ్ శ్రీ నల్లాన్చక్రవర్తుల కృష్ణమాచార్యుల , ప్రధానాచార్యులు సంతోషా గౌతం శ్రీ రామ పట్టాభిషేక పఠానికి కొబ్బరి కాయలు కొట్టి , హారతి ఇచ్చి పిల్లలకు తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు . పాఠశాల వాతావరణం అంతా శ్రీ రామ నామస్మరణ తో మారు మొగిపోయింది . పిల్లలకు శ్రీ రాముని విశిష్టత పాఠశాల ఆచార్యులు తెలియజేశారు . అనంతరం పాఠశాల లో మాతాజీ లు ఆచార్యులు పిల్లలు శ్రీ రామ భజన తో కోలాటాల తో సందడి చేశారు . వచ్చిన హిత చింతకులు , పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇటువంటి ఆధ్యాత్మిక చింతన అలవాటు చేస్తున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు .