వైబోవేతంగా శ్రీరాముని శోభాయాత్ర.

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 22:
అయోధ్యలోని శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని సోమవారం చరిత్రకు నిలయమైన గోవిందాద్రి కొండపైన కొలువై ఉన్న గోవిందా రాజుల ఆలయం నుండి శ్రీరాముని శోభాయాత్రను కన్నులకు పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వరయోగుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభాయాత్రను తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు, వేయి స్తంభాల ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. గోవిందరాజుల ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర, స్టేషన్లో హెడ్ పోస్ట్ ఆఫీస్ చౌరస్తా దుర్గేశ్వర స్వామి ఆలయం ఎల్లం బజార్ మీదుగా లక్ష్మీ టాకీస్ గిర్మాజిపేట నుండి తిరిగి గోవిందరాజుల స్వామి ఉత్సవమూర్తుల ఆలయం వద్ద వరకు కొనసాగింది. శోభాయాత్రకు అశేషంగా భక్తజనులు తరలివచ్చారు. శోభాయాత్రకు విచ్చేసిన భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక అర్చకులు వారియోగుల లక్ష్మణస్వామి పవన్ కుమార్ స్వామి క్రాంతి కుమార్ స్వామి దాతలు ఆకుల అమరేందర్ మరుపెళ్లి సంజీవరావు, బండ శ్రీనివాస్, రాపాక ఉపేందర్, శశిధర్, తోట శివ, నర్రా శశిధర్, శశికాంత్, దిలీప్, శివ, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking