వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 22:
పిల్లల పై కుక్కల దాడి ఘటన తనను కలచివేసింది రాష్ట్ర దేవాదాయ,అటవీ,పర్యావరణ శాఖ మాత్యులు కొండా సురేఖ తన అవేదనను వ్యక్తం చేశారు.
నగర పరిధి 21 వ డివిజన్ ఎల్ బి నగర్ లో ఆదివారం జరిగిన కుక్కల దాడి లో గాయపడి గార్డియన్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న చిన్నారిని మంత్రి పరామర్శించి దైర్యం చెప్పి ప్రభుత్వ పరంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భం మంత్రి వర్యులు మాట్లాడుతూ ఆడుకునే పిల్లలపై కుక్కలు దాడి చేశాయని, ఇదే క్రమం లో తప్పించుకునే క్రమం లో బాబు పరుగెత్తి ఇంటి గద్దెపై పడడం వల్ల తీవ్ర గాయాలయ్యలని, చేతుల పై కుక్క గాట్లు ఉన్నాయని, పిల్లలకు అంటి రెబిస్ ఇంజక్షన్ లు ఇవ్వటం జరిగిందని, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరడం జరిగిందని అన్నారు. బాబుకు ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉన్నట్లుగా వైద్యులు పేర్కొన్నారని, ప్రభుత్వం నుండి ఎన్ ఓ సి అందజేసి ప్రభుత్వ పరం గా చికిత్స అందజేసి ఆదుకుంటామని అన్నారు.
బల్దియా నుండి ప్రతి రోజు 30 కుక్కలను పట్టుకొని 20 కుక్కలకు శస్త్ర చికిత్సలు నిర్వహించి 2-3 రోజులు పర్యవేక్షణలో ఉంచడం జరుగుతుందని, కుక్కలకు శస్త్ర చికిత్సలు చేసే క్రమంలో పిల్లలు కనకుండా ఆపరేషన్ లు నిర్వహించి సంతానోత్పత్తి నీ కట్టడి చేయడం జరుగుతుందని, కుక్కలు ప్రత్యేక వేసవి సీజన్ లో ఉద్రేకం గా ఉంటాయని(సంతానోత్పత్తి సమయం లో) ఇలాంటి తరుణం లో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను కుక్కలు సంచరించే ప్రాంతం లోకి పంపకుండా ఉండడం మంచిదని తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలని అన్నారు. గతం లో మాదిరి గా కుక్కలకు విషాహారం ఇచ్చి చంపడానికి వీలులేదని, పెటా, బ్లూ క్రాస్ వంటి స్వచ్చంద సంస్థలు మూగా జీవాల సంరక్షణకు పనిచేస్తున్నాయని తెలిపారు. కుక్క లకు ముందస్తు గా రాబీస్ ఇంజక్షన్లు ఇచ్చి కరిచినా, గాయం కలిగిన ప్రమాదం కలుగకుండా చేయడం జరుగుతుందని, ఎప్పటి కప్పుడు జీ డబ్ల్యు ఎం సి అధికారులు అప్రమత్తం గా ఉంటూ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నారని, ఈఘటన అత్యంత బాధాకరం అని, కుక్కలు,కోతుల నియంత్రణకు తగు ప్రణాళికలు సిద్దం చేస్తామని,కుక్కలు ఉద్రేకం గా ఉండే సీజన్ లో ప్రజలు కుడా అప్రమత్తం గా ఉండాలని ఈ సందర్భం గా మంత్రి సూచించారు.
ఇట్టి కార్యక్రమం లో బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా, సి ఎం హెచ్ ఓ డా.రాజేష్, గార్డియన్ ఆస్పత్రి అధినేత డాక్టర్ కాళీ ప్రసాద్, తదితరులు ఉన్నారు.