మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జనవరి 22: జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు, ఆర్జీలను పరిష్కరించడానికి ప్రధాన్యతనివ్వాలని ఈ విషయంలోఅధికారులు వారికి వారి శాఖలకు సంబంధించిన ఆర్జీలను వెంటనే పరిష్కరించి వారి సమస్యలు అక్కడికక్కడే తీర్చాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియలతో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్ జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు సంబంధించి ఆర్జీలు, దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలు తమ సమస్యలు పరిష్కారవుతాయని ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసాల కోర్చి వస్తుంటారని దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలు, దరఖాస్తులు, ఫిర్యాదులను వీలైతే అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజల వద్ద నుంచి వచ్చిన 77 ఫిర్యాదులు వచ్చాయి. అని తెలిపినారు. దీంతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే ప్రతి ప్రజావాణి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వాటిని ఎక్కడ కూడా పెండింగ్లో ఉంచకుండా వెనువెంటనే పరిష్కరించాలని… ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయరాలని కలెక్టర్ గౌతమ్ అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.