వేములవాడ టౌన్,( ప్రజాబలం ) ప్రతినిధి:- వేములవాడ పట్టణంలోని గీతా విద్యాలయం 2007-2008 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం రోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వివిధ రంగాలలో స్థిరపడిన మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించి కొని, తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.