వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), ప్రతినిధి :- సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజున బుల్లితెర జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం కంటే ముందు రాజన్న ఆలయంలో కుటుంబ సమేతంగా కోడె మొక్కును చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం నాగిరెడ్డి మంటపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ముక్కు అవినాష్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని, ప్రతి సంవత్సరం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం మా కుటుంబానికి ఆనవాయితీ అని, అందులో భాగంగా ఈ సోమవారం రోజున స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని అని తెలిపారు.