చేనేత మిత్రతో తీరేను చింత: అందె లక్ష్మణ్ రావు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 2023 సెప్టెంబర్ 03: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వమ్ చేనేత కార్మికులకు అనేక విధాలుగా ఆదు కుంటున్న ప్రభుత్వం అని తెలియ పరుస్తూ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరో కొత్త చేనేత మిత్ర పథకానికి శ్రీకారం చుట్టిండని, ప్రకటించిన విధంగా మాట తప్పకుండా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి చేనేత మిత్ర పథకం అమల్లోకి రావడం అన్నది చేనేత కార్మికుల జీవితాలలో కొంతమేర చింత తీరే విధానమని భావన ఋషి కూపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు హర్షం వ్యక్తం చేస్తూ ఈ పథకం ద్వారా తెలంగాణలోని సహకార, సహకారేతర ప్రాథమిక చేనేత సహకార సంఘాలలోని చేనేత కార్మికులకు, చేనేత పారిశ్రామిక వేత్తలు, స్వయం సహాయక సంఘాలను ఏర్పరుచు కునే చేనేత కార్మికులందరికీ 40 శాతం నూలు సబ్సిడీ అందించ బడుతోందని, పథకంలో భాగంగా మగ్గం మీద పనిచేసే ప్రతి కార్మికునికి బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తు నెలనెలా రూ.3 వేలు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు, తొలి సాయం క్రింద 32 వేల మంది నేతన్నల కుటుంబాలకు చేయూతనందిస్తున్న ఏకైక బీ.అర్.యస్ ప్రభుత్వానికి పద్మశాలీలు అందరూ ఆదరంతో కలసి కట్టుగా ఎల్లవేళలా తమ తమ వంతు సహకారం అందిస్తూ కృతజ్ఞులై ఉంటూ బీ.అర్.యస్ ప్రభుత్వాన్ని బలపరుస్తారని ఆనందంతో ప్రకటించడం జరిగినదని భావన ఋషి కూపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు తెలియ పరచినారు. జై మార్కండేయ

Leave A Reply

Your email address will not be published.

Breaking