సమస్యల వలయంగా అంజలీ గార్డెన్

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 25 మార్చి 2025
ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా గుడ్ మార్నింగ్ మణికొండ పెరిట భారత రాష్ర్ట సమితి పార్టీ నాయకులు మంగళవారం రోజున అంజలీ గార్డెన్ వీదులలో తిరిగి సేకరణలో భాగంగా లాంకో హిల్స్ సమీపంలో ఉన్న 132 కె.వి సబ్ స్టేషన్ ప్రక్కన వస్తున్న టీం ఫోర్ బహుళ అంతస్తుల సముదాయం వారు సరియైన సాంకేతిక పద్ధతులు అవలంబించ కుండా డ్రైనేజ్ పైప్ లైన్ వేసిన కారణంగా ఇప్పటికీ నాలుగు సార్లు రోడ్డు కుంగిపోవడం జరిగింది. ఈ విషయం గూర్చి పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చి నప్పటికీ తూతూ మంత్రగా రోడ్డుపై ప్యాచ్ వర్క్ చేసి మ మః అనిపించుకొన్న కారణంగా మొత్తం రోడ్డంతా గుంతల మయంగా ఉంది. హైదరాబాద్ వాటర్ వర్క్స్ వారు ఒక నిర్ణీత సమయం లేకుండా ఇష్టం వచ్చినప్పుడు నీళ్లు వదులుతున్న కారణంగా స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పుప్పాలగూడ మెయిన్ రోడ్డు నుంచి అంజలి గార్డెన్స్ మీదగా లాంకో హిల్స్ తదితర ప్రాంతాలకు వచ్చి వెళ్లే వాహనాల సంఖ్య గణనీయంగా ఉండడంతో స్థానికులు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా హనుమాన్ గుడి వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకుంటోంది. ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడం కొరకు స్కూల్ మరియు ఆఫీస్ పని వేళల్లో వన్వే ట్రాఫిక్ నిర్వహించడం, స్పీడ్ బ్రేకర్లు వేయడం మరియు భారీ వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడం లాంటి చర్యల వల్ల కొంతమేర స్థానికులకు ఉపశమనం కలుగుతుంది. వారాంతపు సంత పుప్పాలగూడ మెయిన్ రోడ్ లో ఉన్న ఇండ్ల గేట్లు ముందు ఉన్న స్థలంలో తమ వ్యాపార కార్యక్రమాలు సాగిస్తున్న కారణంగా స్థానికులకు ఇళ్లలోంచి బయటికి రావాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లుగల వారు చెత్తను పోగుచేసి వీది చివర వేయడం, అట్టి చెత్త వెంట వెంటనే తీయకుండా వారంకు ఒకసారి తీయడం వలన దుర్గందంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. వీధి దీపాలు సరిగా వెలుగడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఏ రకమైన నోటీసు గానీ సమాచారం గానీ ఇవ్వకుండా ప్రస్తుతం మార్కెట్ ధరలానుసారం ఇంటి పన్ను విపరీతంగా పెంచిన కారణంగా స్థానికులు మున్సిపాలిటీ చర్యలను విమర్శిస్తున్నారు. పై విషయాలు మున్సిపాలిటీ వారి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ చర్యలు చేపట్టే లేదని స్థానికులు వాపోయారు. కావున సమస్యలకు పరిష్కార దిశగా సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, ఉపేందర్నాధ్ రెడ్డి, గోరుకంటి విఠల్, కిరణ్ యాలాల, బండమీది మల్లేష్, కందాడ ప్రవీణ్, సుమనళిని, బొడ్డు శ్రీధర్, రమణ మూర్తి తది తరులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking