రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 25 మార్చి 2025
మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీ రోడ్డు నంబర్ 4లో గల కమ్యూనిటీ హాల్ నందు ఫాజిల్, ఆమీర్, మొజాహిద్ ల ఆద్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భముగా హిందూ ముస్లింలు కలసి కట్టుగా సోదర భావంతో మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకున్న ఇఫ్తార్ విందు కార్యక్రమానికి బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ర్ట యువ నాయకుడు కార్తీక్ రెడ్డి హాజరు కాగా స్థానిక మాజి మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, లక్ష్మీనారాయణ, తాజుద్దీన్, బి.ఆర్.ఎస్ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, రూపా రెడ్డి, అందే లక్ష్మణ్ రావు, ముత్తంగి లక్ష్మయ్య, ఏర్పుల శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, ఉపేందర్నాధ్ రెడ్డి, రామ సుబ్బా రెడ్డి, బుద్దోలు బాబు, మాల్యాద్రి నాయుడు, దిలీప్, కిరణ్ యాలాల, జై, సుమనళిని, సుమన్, బొడ్డు శ్రీధర్, షేక్ ఆరిఫ్ మహమ్మద్, శ్రీనివాస్ చారి, తిరుపతి, యాలాల బెన్నీ, హరి, రేఖ, తిరుపతి, చందు, విష్ణు తది తరులు పాల్గొన్నారు.
