ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఎప్రిల్ 04 : మంచిర్యాల జిల్లా లోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో హనుమాన్ గుడి వద్ద స్వాముల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.మంగవారం ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు మాట్లాడుతూ…కొర్విచెల్మ గ్రామంలో హనుమాన్ గుడి వద్ద అన్నదానం చేయడం వల్ల ఎంతో ముక్తి లభిస్తుందని అన్నారు,ప్రతి ఒక్క హిందూవులు హనుమాన్ జన్మోత్సవాన్ని జరుపుకోవాలని అన్నారు. సుమారు1000 మంది భక్తులు అన్నదానం కార్యక్రమం కు వచ్చారాని తెలుపారు.హనుమాన్ దీక్ష విరమణకు సాయంత్రం 21మంది స్వాములు పాదయాత్ర ద్వారా కొండగట్టుకు స్వాములు బయలుదేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.