ప్రశ్న పత్రాల లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

 

సీబీఐకి కేసు అప్పజెప్పాలి – 48 గంటల నిరసన దీక్షలు

లక్షలాదిమంది నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

….బి.ఎస్.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణంనాయిని ఈశ్వర్

సంగారెడ్డి ఏప్రిల్ 04 ప్రజ బలం ప్రతినిది:
ప్రశ్న పత్రాల లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, సీబీఐకి కేసు అప్పజెప్పాలిని బి.ఎస్.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణం నాయిని ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బి ఎస్ పి సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు వినోద్ కుమార్ అధ్యక్షతన సంగారెడ్డి లోని నటరాజ్ థియేటర్ పక్కన 48 గంటల నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి కర్ణం నాయిని ఈశ్వర్ మాట్లాడుతూ 36 లక్షల నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రశ్న పత్రాల లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐకి కేసు అప్పజెప్పి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.చైర్మన్ జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన పరీక్షలు అన్ని రద్దు చేయాలిని టి.ఎస్.పి.ఎస్.సి. కార్యవర్గాన్ని రద్దు చేయాలి అని అన్నారు.
తెలంగాణ నిరుద్యోగులకు ఆత్మ స్థైర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఏ నటరాజ్, జిల్లా ఇన్చార్జులు
డప్పు.ప్రేమ్ కుమార్, నిరుడి జగదీశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఇక్బాల్ , జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి బాలయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఈశ్వర్, జిల్లా కోశాధికారి జనార్ధన్ , జిల్లా కార్యదర్శులు పెంటన్న, జిల్లా మహిళా కన్వీనర్ పల్లవి , అసెంబ్లీ అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్చార్జీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking