మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 04 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కారుకూరి కమలాకర్ మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మాజీ జడ్పీటీసీ,పార్టీ మండల అద్యక్షుడు చుంచు చిన్నయ్య బాదితునికి అందజేసారు.ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ…కమలాకర్ గత కొన్ని రోజుల నుండి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆసుపత్రుల్లో చూపించుకుని వైద్యం కోసం ఖర్చు చేసిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయనిధికి అర్జీ పెట్టుకోగా మంజూరు అయిన 42 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మోదెల మాజీ సర్పంచ్ బాకం లచ్చన్న,బీఆర్ఎస్ నాయకుడు కారుకూరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.