….జిల్లా కలెక్టర్, ఎస్పిలకు బాధితురాలు విన్నపం
సంగారెడ్డి ఏప్రిల్ 04 ప్రజ బలం ప్రతినిధి దొంగతనం చేశాడనే నెపంతో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంకు చెందిన బెడ బుడగ జంగం కులానికి చెందిన దళితుడైన నా భర్త మద్దెల మల్లేశం ను చిత్రహింసలకు గురి చేసి కరెంట్ షాకు పెట్టి హత్య చేసిన 30 మంది నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షంచాలని, తనకు ఎస్సీ ఎస్టీ POA చట్టం- 1989 ప్రకారం తక్షణ సహాయం, నష్ట పరిహరం, పునరావాసం కల్పించాలని కోరుతూ బాధితురాలు మీనా
దళిత సంఘాల అధ్వర్యంలో విన్నవించింది.. *డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ ల అధ్వర్యంలో మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్, ఎస్పిలకు పిర్యా దు చేశారు. ఈ సందర్భంగా శంకర్ ,మాణిక్ లు మాట్లాడుతూ వైరు దొంగతనం చేశాడని ఒక దళితుడిని రాత్రాంతా చిత్రహింసలకు గురిచేసి కరెంట్ షాక్ పెట్టి మరీ చంపడం అమానవీయమైన సంఘటన జరిగిందన్నారు.
మల్లేష్ ను మార్చి 25 న అర్ధరాత్రి పొలం కాడ కొంతమంది రైతులు పట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తూ జాతీయ రహదారి పై వున్న రైతు సంఘం వద్ద 30 మంది కి పైగా మూకుమ్మడిగా దాడి చేసి రైతు సంఘం భవనం ముందు నిర్బంధించి కరెంట్ షాక్ పెట్టి కాల్చి చంపారన్నారు.ఈ హత్యపై పొలీసులు హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేసినప్పటికీ కొంత మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రైతు సంఘం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రామిరెడ్డి,ఆనంద్ రెడ్డి,నర్సింహ్మ రెడ్డి తదితర 30 మంది నిందితులను తప్పించేందుకు కుట్రలు చేస్తున్నారని వివరించారు
బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎస్సి, ఎస్టి అత్యాచారాల నిరోధకచట్టం ప్రకారం 8 లక్షల 25 వేల రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. తక్షణ సహయం గా బియ్యం, నూనె, పప్పు దినుసులు అందించే విధంగా జిల్లా అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబంలో ముగ్గురు పసిపిల్లలు ఉన్నారని వారిని వెంటనే సంక్షేమ గురుకులాల్లో చదివించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,పెన్షన్ అందించాలని కోరారు
. గ్రామంలోని బేడ బుడగ జంగం కులానికి చెందిన దళితులకు జాతీయ గ్రామిణ ఉపాధిహామీ కార్డులను అందించలేదు. వెంటనే జాబ్ కార్డులను అందజేసి పని కల్పించాలని, భూపంపిణి చేయాలని డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించాల ని కొరారు.యువతకు ఉపాధి అవకాశాలు లేక తిండి దొరకక ఇలాంటి చిన్న దొంగతనాలు చేస్తూ దళితులు హత్యలకు గురి కావడం బాధాకరమన్నారు.. ప్రభుత్వమే ఉపాధి అవకాశాలు కల్పిస్తే దళితులు ఆత్మగౌరవంతో బతుకుతారని, దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలి…దళితులకు భూములు పంపిణి చేస్తే ఆత్మగౌరవంతో బతికేవారన్నారు దళితులను దొంగలుగా ముద్రవేస్తూ సమాజం మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేస్తుందన్నారు.
హత్యలో పాల్గొన్న 30 మంది నిందితులలో కేవలం 6 గురినే పోలీసు విచారణకు పిలిచి మిగతా నిందితులను వదిలేస్తున్నారు. వెంటనె మొత్తం 30 మంది నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించే విధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరు, ఎస్పీ ని అదేశించాలని కోరారు.. బాధిత కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం తక్షణ సహయం,నష్ట పరిహారం, పునారవాసం కల్పించాలని కొరారు..మృతుడు బార్యకు ఉద్యోగం, పెన్షన్ ,డబుల్ రూమ్ ను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో డిబిఎఫ్ రాష్ట నాయకులు అర్.లక్ష్మి,పులి కల్పన,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అశోక్ ,సహయ కార్యదర్శి ప్రవీణ్ ,బేడ బుడగ జంగం అధ్యక్షుడు యం.అంజయ్య,ప్రభాకర్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు నీరుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు
Prev Post