మేడ్చల్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 4: రాష్ట్రంలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలో ప్రశ్నా పత్రాల లీకేజీ సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.
మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
అనంతరం ,వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాలు సూచనలు ని తప్పక అమలు చేస్తున్నాము అని తెలిపినారు . రెండు రోజుల నుండి జరుగుచున్న పదవ తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో పరీక్షలకు హాజరగుచున్న 44013, విద్యార్థులకు 220 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి ఫ్లైయింగ్ బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు తాను , అదనపు కలెక్టర్లు, ఆర్.డి.ఓ.లు,నిత్యం అట్టి కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఎటువంటి చిన్న పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూస్తున్నామని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్, ఏ.ఎన్.ఏం తో సహా ఎవ్వరిని కూడా మొబైల్ ఫోన్ ను అనుమతించడం లేదని, ప్రతి కేంద్రం వద్ద ఒక పురుష, ఒక మహిళా కానిస్టేబుల్ ను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించన మీదటే పరీక్షా కేంద్రాలకు పంపుతున్నామని తెలిపారు.
జిల్లాలో ఉన్న220 పరీక్ష కేంద్రాల కు ఒక్క మండలమునకు ఒక్క ప్రత్యేక జిల్లా స్థాయీ అధికారి ని నియమించాము అని తెలిపినారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సిబ్బంది విధులు నిర్వహించాలని పరీక్ష విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన మంత్రి కి వివరించారు .
జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు హాజరగు విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల సలహలు మరియు సందేహాల నివృత్తి కొరకు Toll Free No. 040- 35659758 ఫోన్ నెంబర్ ని ఎర్పాటు చేసాము అని తెలిపినారు .
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖాధికారి విజయకుమారి,తదితరులు పాల్గొన్నారు.