టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజీవ రామ్ జయంతి

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 05 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా టి.డి.పి పార్లమెంట్ కార్యదర్శి కేతినేని హరిశ్చంద్ర ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్లో గల బాబు జగజీవన్ రాo 116 జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేతినేని హరిశ్చంద్ర మాట్లాడుతూ శాంతి, సహనం, అహింస, సత్యం, సమ్యక్ జ్ఞానం అనే అంశాలను మానవాళికి భోదించిన మహావీరుని జీవిత సందేశం మనందరికీ ఆదర్శం.అన్ని అన్నారు అదేవిధంగా అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని . ఉత్తమ పార్లమెంటేరియన్ గా 30 ఏళ్లపాటు కేంద్రమంత్రిగా – దేశానికి ఉప ప్రధానిగా ఎన్నో పదవులు నిర్వహించి పలు వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని ,దళితుల- వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన జగజ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తి దాయకమని , ఆయన చూపిన బాటలో నేటి యువత ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు గోపి రవి, ఎస్సీ సెల్ జిల్లా పార్టీ నాయకులు బైరు అప్పారావు, బీసీ సెల్ నాయకులు వినోద్ నాయక్, బోడెపుడి రవి, నాగండ్ల లక్ష్మణ్, కన్నీటి పృథ్వి, కాంపాటి విజయ్, కూచిపూడి జై, పెరుమాళ్ళు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking