రాజేంద్రనగర్ ఏప్రిల్ 4: రాబోయే ఈద్ ఉల్ ఫితర్(రంజాన్) సందర్భంగా, హైల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.జ్యోతి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ చింతల్ మెట్ లో నిరుపేద ముస్లిం కుటుంబాలకు పి.జగదీష్ కుమార్ సహకారం తో (కుటుంబంలో 20 మంది సభ్యులు) కొత్త బట్టలు బహుకరించారు. ఈ సందర్భంగా కె.జ్యోతి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక వేలమంది ఆకలిని తీర్చామని, నిత్యావసర సరుకులు అందజేస్తూ, పేదల అత్యవసరాలను తీర్చేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్ధంగా పేదలకు సేవ చేస్తున్న, తమ సంస్థకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పేదల అవసరాలు తీర్చడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదని ఈ సందర్భంగా ఆమె తన సంస్థ కార్యకలాపాలను గూర్చి వివరించారు.ఈ కార్యక్రమం లో పి.ఉషా రాణి. పి.విన్య మణి సూర్య. కె.ప్రవీణ్ కుమార్ జగదాంబ. ప్రేమలత. బి.శ్రీనివాస రెడ్డి. సునీత రెడ్డి. జి.రాజు కల్పనా రెడ్డి. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు