సలాక ఆత్రేయ శర్మ నేతృత్వంలో వార్షికోత్సవ వేడుకలు
6న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
మెదక్ తూప్రాన్, ఏప్రిల్, 4. ప్రజా బలం న్యూస్ :-
తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ కొండగట్టు అంజన్న క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం 25 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమాన్ మాలాధారణ గురుస్వామి వీరాంజనేయ స్వామి ఆలయ పూజారి, పురోహితులు శలక ఆత్రేయ శర్మ మాట్లాడుతూ ఇక్కడ దేవాలయం స్థల మహాత్యం గొప్పదని ఏప్రిల్ 4 మంగళవారం నుండి ఏప్రిల్ 6 గురువారం వరకు వీశేష పూజలు నిర్వహించబడుతాయని ఆత్రేయ శర్మ తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్ పెద్ద చెఱువు కట్టపై వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారు భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చే పిలిచిన పలికే దైవము. ప్రకృతి రమణీయమైన గుట్టలు, చెఱువులో నీరు, ప్రక్కకు పచ్చని పంట పొలాలు, ఈ ప్రశాంత వాతావరణంలో మనసంతా రంజింపజేస్తుంది. పక్కన బైపాస్ రోడ్ జాతీయ రహదారి ప్రక్కన దశాబ్దాల జీవన సమరంలో అలసి పొలసిన వారికి ఆలంబన ఇచ్చే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇచ్చటికి కుల, మత భేదములు లేకుండా ఎందరో భక్తులు స్వామిని కొలుస్తున్నారు. దుష్ట గ్రహ బాధా పీడితులు, శారీరక, మానసఅదే విధముగా సకల దేవతా గణములకు తరించుటకు 25 వ వార్షికోత్సవం దేవతా మూర్తులు గ్రామ వాసులకు మరియు అశేష భక్త జనులకు ఇలవేల్పు దైవములైన వారి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు. భక్తాగ్రేసులకు తెలియజేయునది ఏమనగా మీ అందరి సహాయ సహకారములచే గత 30 ఏళ్ల నుండి హనుమత్ జయంతి ఉత్సవము జరుపబడుచున్నవి. తేదీ 4 మంగళవారం శోభకృత్నామన యిర చైత్ర త్రయోదశి రోజున ఉ గణపతి పూజ, పుణ్యాహవాచనం, సీతారామచంద్రుల వారికి పంచామృతమ గంగ అభిషేకాలు, వీశేష పూజలు, అఖండ దీపారాధన, అంకురార్పణం, సుందరకాండ, గురుచరిత్ర పారాయణములు మన్యు పాశుపదము, తీర్థ ప్రసాద వితరణ, నిర్వహించామని, తేది: 5 బుధవారం శోభకృత్ నామ సం॥ర చైత్ర శు॥ చతుర్దశి రోజున గణపతి, నవగ్రహ, రుద్ర, పంచసూక్త, మన్యుసూక్త లక్ష్మీ హోమములు, భిక్ష ఇరుముడి, మంగళహారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ, అన్నదానము జరుపబడును. తేది: 6 గురువారం శోభభకృత్ నామ సం||ర చైత్ర శు॥ పౌర్ణమి (హనుమాన్ జయంతి) హనుమత్ మన్యు పాశుపధము, సింధూరము, లక్ష పత్రి పూజ, లక్ష పుష్పార్చన, గణపతి పంచాయతన దేవాలయములో ఉన్న అమ్మ వారికి ఓడిబియ్యం, కుంకుమార్చన, శ్రీశ్రీశ్రీ యతివర మాధవానంద సరస్వతి స్వామి వారి పాద పూజ, అనుగ్రహ భాషణ జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈకార్యక్రమాని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మచ్చ యాదగిరి, గురుస్వామి మాట్లాడుతూ
మరియు ఉ॥ 9 గంటల నుండి ఊ॥ 11 గంటల వరకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు జరుగుతాయని ఆరొజు చైత్ర పౌర్ణమి వీశెష మైన రోజు అని భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతములు పాల్గొన్న లని కొరరు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు మచ్చయదగిరి, గడ్డం ప్రశాంత్ కుమార్, మల్లి ఖర్జున్, రెపల్లే యాదగిరి, శేఖర్, నవీన్ , హరీష్ ,కొడిప్యాక వెంకటేష్ గుప్తా, రమేష్ గౌడ్, లక్ష్మన్, అజయ్, రాజు, చంద్రం, వైఫై నవీన్, నాగరాజు, నరేశ్ పటేల్, వేద పండితులు హన్మన్ మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.